NIFTY TRADE: 17,765 కీలకం
నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది. చైనా మార్కెట్ కుప్పకూలింది, అక్కడి పెట్టుబడులన్నీ ఇక మనకే అని వార్తలు రావడంతో భారీగా పెరిగిన భారత మార్కట్లు ఇపుడు నీరసంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉంటే.. తెగి పెరిగిన నిఫ్టి ఇపుడు కదలడం కష్టంగా ఉంది. ఉదయం నుంచి చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా కూడా. కాని నిఫ్టి నామమాత్రపు లాభాల్లో ఉంది. ‘కథలు’ విని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల చేతులు ఇపుడు బాగానే కాలుతున్నాయి. ఇక నిఫ్టి విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 17,790. గత నెల రోజుల నుంచి నిఫ్టి కీలక స్థాయి 17,770 ఉంటోంది. ఇవాళ కూడా అంతే. ఓపెనింగ్‌లో నిఫ్టి పెరిగితే వెయిట్ చేయండి. పెరగనీయండి. 17,850 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఇక్కడే నిఫ్టిని షార్ట్ చేయొచ్చు. లేదా17,880 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. రావడం కష్టమే కాని. చూడండి. ఇది రెండో ప్రతిఘటన స్థాయి. 15 పాయింట్లు స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మండి. నిఫ్టి ఇవాళ కీలక మద్దతు స్థాయి 17,770ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ స్థాయి దిగువకు వస్తే 17,710 ప్రాంతానికి వచ్చే చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఆర్బీఐ పాలసీ చూడండి. కీలక ప్రకటనలు లేకపోతే నిఫ్టి దిగువ స్థాయిని తాకుతుంది.