NIFTY TRADE: పెరిగే వరకు ఆగండి…
BBషార్ట్ సెల్లర్స్‌కు ఇవాళ మరో అవకాశం రానుంది. భారీగా క్షీణించిన మార్కెట్లు కాస్త తేరుకుంటున్నాయి. అమెరికా మార్కెట్ మాత్రం స్థిరంగా ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17,646. సింగపూర్ నిఫ్టి లెక్క ప్రకారం నిఫ్టి 17,750-17,780 ప్రాంతంలో ప్రాంభరం కావాలి. సెంటిమెంట్ పరంగా నిఫ్టి పెరిగినా.. టెక్నికల్‌గా నిఫ్టికి ప్రధాన నిరోధం 17,780 ప్రాంతంలో ఎదురు కానుంది. 17,800 దాటితే నిఫ్టిలో ట్రేడ్ చేయొద్దు. 17,750-17,780 ప్రాంతంలో17,800 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. ఎందుకంటే ఆసియా ఈ స్థాయి ఉత్సాహం యూరప్‌లో ఉండే అవకాశాలు తక్కువ. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంటుంది. కాబట్టి అధిక స్థాయిలో అమ్మండి. నిఫ్టి 17,715పైన ఉన్నంత వరకు పరవాలేదు. ఈ స్థాయి దిగువకు వస్తే మాత్రం నిఫ్టి దగ్గర్లో ఎక్కడా మద్దతు లేదు. కాబట్టి కొనుగోళ్ళ జోలికి వెళ్ళకండి. అధిక స్థాయిలో అమ్మి… మీ రిస్క్‌ను బట్టి స్వల్ప లాభంతో బయటపడండి. ఎందుకంటే యూరో పటిష్టంగా ఓపెనైతే… నిఫ్టిలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
Warning: మార్కెట్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కోసం ఇన్వెస్టర్లకు మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయాలు, డేటా మీకు అందించే ప్రయత్నం ఇది. పెట్టుబడికి సంబంధిం తుది నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ అనలిస్ట్ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.