NIFTY TRADE: 17200 తరవాతే…
నిఫ్టి ఇవాళ చాలా గట్టి ప్రతిఘటన స్థాయిలో ప్రారంభం అవుతోందని డేటా అనలిస్ట్ వీరేందర్ అంటున్నారు. ఇవాళ నిఫ్టికి 17187, 17234 వద్ద గట్టి ప్రతిఘటన ఉంటుదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే నిఫ్టి గనకు 17200పైన పటిష్ఠంగా ఉండే పక్షంలో 17136 అంటే నిన్నటి ముగింపు స్టాప్‌లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చని ఆయన అంటున్నారు. దాదాపు అన్ని కీలక మూవింగ్ యావరేజీలకు ఇవాళ్టి ట్రేడింగ్ ప్రధానం కానుంది. నిఫ్టి గనుకు17254 లేదా 17318 దాటితే అన్ని మూవింగ్ యావరేజీపైకి నిఫ్టి చేరుకుంటుందని ఆయన అంటున్నారు. అయితే పై స్థాయిలో తీవ్ర ప్రతిఘటన ఉంటుందని, ఆ విషయం మర్చిపోవద్దన్నారు. ఇతర డేటా కోసం, బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం దిగువ వీడియోలు చూడండి.
https://www.youtube.com/watch?v=Gi5Pc54MsNA
https://www.youtube.com/watch?v=sp69ickvYhQ