NIFTY TODAY: 17,380 కీలకం
నిన్న దాదాపు 17000 స్థాయికి చేరిన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత కోలుకుని లాభాల్లో ముగిసింది. ఇపుడు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. నిఫ్టి ప్రస్తుత అనిశ్చితి నుంచి బయటపడాలంటే 17380ని దాటి 17400పైన స్థిరపడాల్సిన అవసరం ఉందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 17266. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17300 స్థాయిని దాటనుంది. ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్ – 17430
రెండో ప్రతిఘటన – 17386
తొలి ప్రతిఘటన -17357
నిఫ్టికి కీలకం – 17206
తొలి మద్దతు -17177
రెండో మద్దతు -17148
డౌన్ బ్రేకౌట్ -17104
నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నా…నిన్న వచ్చిన షార్ట్ కవరింగ్‌తో నిఫ్టి మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చింది. టెక్నికల్స్ సెల్ సింగ్నల్ ఇస్తున్నా…దిగువస్థాయిలో మద్దతు అందుతోంది.