NIFTY TODAY: మిడ్ సెషన తరవాత…
నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమైనా.. అసలు సరీక్ష మిడ్ సెషన్లో ఎదురు కానుంది. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా హాంగ్‌కాంగ్ మార్కెట్ చాలా బలహీనంగా ఉన్నా… మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కావొచ్చు. దీనికి కారణం రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగియడం. అయితే డాలర్ బలరం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వంటి అంశాలు మార్కెట్లను కంట్రోల్ చేస్తున్నాయి. సో.. మిడ్ సెషన్లో యూరో మార్కెట్లు ఆసియా మార్కెట్ల బాటపడుతాయా? లేదా అమెరికా మార్కెట్ల బాట నడుస్తాయా అన్నది చూడాలి. నిఫ్టి లెవల్స్‌కు సంబంధించి వీరేందర్ కుమార్ ఇస్తున్న టార్గెట్ 17947, 18020. మద్దతు 17823, 17760 ప్రాంతంలో అందొచ్చు. ఇతర సూచీల లెవల్స్ కోసం వీడియో చూడగలరు.