NIFTY TRADE: పెరిగే వరకు ఆగండి
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ కూడా చాలా ఆసియా, యూరో మార్కెట్లకు సెలవు. అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్ మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. మన ట్రేడింగ్ క్లోజింగ్ వరకు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోనే ఉంటే… నిఫ్టి గ్రీన్‌లో లేదా స్థిరంగా ముగిసే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17354. సింగపూర్ నిఫ్టి దాదాపు వంద పాయింట్ల ప్రీమియంతో ట్రేడవుతోంది. నిఫ్టి గనకు స్థిరంగా ప్రారంభమైతే కాస్సేపు ఆగండి. నిఫ్టికి 17320 వద్ద గట్టి మద్దతు ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కోలుకుంటుందా లేదా 17280ని తాకుతుందా అనేది చూడండి. ఒకవేళ నిఫ్టి తొలుత దిగువ స్థాయిని తాకింది 17260 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టికి తరువాత స్థాయి 17230 వద్ద మద్దతు ఉంది. నిఫ్టి గనుక 17320పైన ఉంటూ…ముందుకు సాగితే, 17400ని దాటే అవకాశముంది. నిఫ్టి తొలి ప్రతిఘటన 17420పైన అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. 17445 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. ఈ స్థాయి దాటితే నిఫ్టిని అమ్మొద్దు. టెక్నికల్‌గా నిఫ్టి ఓవర్‌బాట్ జోన్లో ఉంది. సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి.