అమెరికా ఫ్యూచర్స్ దెబ్బ…
వీక్లీ డెరివేటివ్స్ ప్రభావం మార్కెట్‌పై ఇవాళ బాగా కన్పించింది. 18600 కాల్ రైటర్స్ తమ ప్రతాపం చూపారు. ఫెడ్ నిర్ణయం తరవాత ఆసియా మార్కెట్లు ఒక మోస్తరుగానే నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా అలానే ఉన్నాయి. అయితే సరిగ్గా ఇటు వీక్లీ డెరివేటివ్స్ స్క్వేర్ ఆఫ్ సమయం దగ్గర పడుతున్న సమయంలోనే అమెరికా ఫ్యూచర్స్ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సూచీలు ఒక శాతంపైగా నష్టపోవడంతో.. చాలా మంది ట్రేడర్లు తమ పొజిషన్స్‌ను రోల్ ఓవర్ చేయలేదు. పైగా 18600 కాల్ ప్రీమియం భారీగా క్షీణించడంతో… బుల్స్ బాగా నష్టపోయారు. దీంతో చివర్లో నిఫ్టి బాగా నష్టపోయింది. ఉదయం 18652 పాయింట్ల వద్ద అమ్ముకున్నవారు బాగా లబ్ది పొందారు. 18670-18700 మధ్య అమ్మాల్సిందిగా పలువురు టెన్నికల్ అనలిస్ట్‌లు హెచ్చరించారు. 18700 దాటడానికి మార్కెట్ వద్ద ఎలాంటి ట్రిగ్గర్ లేనందున అమ్మడమే శ్రేయస్కరమని చెప్పారు. 18600 కాల్ రైటింగ్ చేసినవారికి ఇవాళ కాసుల పంట. నిఫ్టి 17,682 నుంచి 18414 దాకా క్షీణించడంతో ఒకేరోజు 200 పాయిట్లు లాభం. 18387ను తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 18414కి చేరి… 18400 స్థాయిపైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 245 పాయింట్లు నష్టపోయింది. ఇటీవల బాగా పెరిగిన బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్స్ ఇవాళ ఒక శాతంపైగా క్షీణించాయి. అయితే నిఫ్టిని దెబ్బతీసింది మాత్రం ఐటీ కౌంటర్లే. ప్రధాన కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కూడా బాగా నష్టపోయాయి. ఓఎఫ్ఎస్ కింద షేర్లను ఆఫర్ చేస్తుండటంతో ఐఆర్సీటీసీ షేర్ ఏకంగా 6.5 శాతం నష్టపోయింది. ఇక అంబుజా సిమెంట్ 4 శాతం నష్టపోవడం విశేషమే. బ్యాంక్ నిఫ్టిలో ఒక్క ఫెడరల్ బ్యాంక్ తప్ప మిగిలిన సూచీ షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 4 శాతం క్షీణించింది.