For Money

Business News

18500 దగ్గర్లో నిఫ్టి

మార్కెట్‌ అధిక స్థాయిలో ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం అనలిస్టులు హెచ్చరించే నట్లే నిఫ్టి 16670 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. వీక్లీ డెరివేటివ్‌ క్లోజ్‌ కావడంతో పది గంటల ప్రాంతంలో గట్టి ఒత్తిడి వచ్చింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకున్నా… అమ్మకాలు కొనసాగాయి. యూరో మార్కెట్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉండటంతో మన మార్కెట్లలో కూడా ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఈసీబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లు భేటీ కానున్నాయి. నిఫ్టికి ప్రస్తుతం 18500 బేస్‌గా కన్పిస్తోంది. మరి ఈ స్థాయిని కూడా బ్రేక్‌ చేస్తుందా లేదా ఈ స్థాయిలో మద్దతు లభిస్తుందా అన్నది చూడాలి. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నా… అవి నామమాత్రమే కావడంతో ఇవాళ్టి క్లోజింగ్‌ చాలా కీలకం కానుంది. ప్రస్తుతం నిఫ్టి 130 పాయింట్ల నష్టంతో 18529 వద్ద ట్రేడవుతోంది.