For Money

Business News

16500పైన ముగిసిన నిఫ్టి

చివరి నిమిషంలో అందిన మద్దతుతో నిఫ్టి కీలక స్థాయికి ఎగువన ముగిసింది. ఆరంబంలో 16649 పాయింట్లను తాకిన నిఫ్టి.. మిడ్‌ సెషన్‌ తరవాత వచ్చిన అమ్మకాల ధాటికి 16438 పాయింట్లకు పడిపోయింది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి 200 పాయింట్లు పడిందన్నమాట. అయితే చివరల్లో షార్ట్‌ కవరింగ్‌ రావడంతో నిఫ్టి 16522 స్థాయి వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 62 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 185 పాయింట్లు క్షీణించింది. ఇటీవల పెరిగిన బజాజ్‌ ఆటో, అపోలో హాస్పిటల్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నిఫ్టి డీలా పడింది. జిందాల్‌ స్టీల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నుంచి మద్దతు అందినా.. నిఫ్టి నష్టాలను ఆపలేకపోయాయి. నిఫ్టి నెక్ట్స్‌ ఏకంగా ఒక శాతం నష్టపోవడం విశేషం. మిగిలిన నిఫ్టి మిడ్ క్యాప్‌, నిఫ్టి బ్యాంక్‌లు మాత్రం లాభాల్లో ముగిశాయి. అదానీ ట్రాన్స్‌ మిషన్‌, పీఈఎల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, మారికో వంటి షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నిఫ్టి నెక్ట్స్ బాగా క్షీణించింది. ఎల్‌ఐసీ స్థిరంగా ముగిసింది.