లాభాల స్వీకరణ..అయినా ఒక శాతం లాభం

మార్కెట్‌లో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించింది. ఆరంభం కాస్త ఒత్తిడి కన్పించినా… మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లపై ఆశతో నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17348కి చేరింది. అయితే యూరో మార్కెట్లు కేవలం ఒక శాతం లాభానికే పరిమితం కావడంతో నిఫ్టి కరగడం ప్రారంభమైంది. విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా అమ్మకాలు ప్రారంభించారు. షార్ట్ కవరింగ్ లేకపోవడంతో నిఫ్టి క్లోజింగ్‌కల్లా 17185 పాయింట్లకు క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే 171 పాయింట్లు లాభపడింది. కేవలం బ్యాంకులు, ఐటీ షేర్ల కారణంగానే నిఫ్టి నిలబడింది. ఎందుకంటే నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో కూడా ఐటీ, బ్యాంకుల షేర్లదే హవా. అదానీ గ్రూప్ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అదానీ విల్మర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా స్థిరంగా ఉన్నాయి. షార్ట్ కవరింగ్ పూర్తయితే మార్కెట్ మళ్ళీ ఓవర్‌బాట్ పొజిషన్‌లోకి వస్తుందేమో చూడాలి.