For Money

Business News

MID SESSION: నిరాశపర్చిన యూరో

ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి క్రమంగా లాభాలు కోల్పోయింది. నిన్న భారీ లాభాలు పొందిన యూరో, అమెరికా మార్కెట్లు ఇవాళ చల్లబడ్డాయి. ఉదయం నుంచి గ్రీన్‌లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌.. యూరో మార్కెట్ల తరవాత డీలా పడ్డాయి. గ్రీన్‌లో మొదలైన యూరో మార్కెట్లు అరగంటలోనే నష్టాల్లోకి వెళ్ళింది. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌. దీంతో ఉదయం నుంచి నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి మిడ్‌ సెషషన్‌లో 16476 పాయింట్లకు అంటే దాదాపు 300 పాయింట్లు క్షీణించింది. అక్కడి నుంచి యూరో మార్కెట్లతో పాటు కోలుకునే ప్రయత్నం చేసింది. అయితే యూరో మార్కట్లు నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టి నష్టాలు పెరిగాయి. ప్రస్తుతం 81 పాయింట్ల నష్టంతో 16524 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిన్న మూడు శాతం పైగా నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ కూడా ఒక శాతం నష్టపోవడం విశేషం. ఇవాళ వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్‌ ఉన్నందున చివర్లో సూచీలు కోలుకుంటాయేమో చూడాలి.