NIFTY TRADE: పెరిగితే అమ్మండి
అమెరికా ఫెడ్ నిర్ణయం స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావం చూపనుంది. నిన్న కొన్ని ఆసియా, యూరో మార్కెట్లు భారీ లాభాలు పొందినా… రాత్రి అమెరికా లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. మార్కెట్లో అనిశ్చితి తీవ్రంగా ఉంది. మన మార్కెట్ స్థిరంగా కన్పిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లకు మంచి దేశీయ ఆర్థిక సంస్థలు మార్కెట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవాళ సింగపూర్ నిఫ్టి రెడ్‌లో ఉంది. ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే.. నిఫ్టి 17520 ప్రాంతంలో ప్రారంభం కావాలి. కాని ఈ స్థాయిలో మార్కెట్‌కు ఎలాంటి మద్దతు లేదు. నిఫ్టి క్రితం ముగింపు 17562. నిఫ్టికి 17490 కీలక మద్దతు స్థాయి. అంటే మార్కెట్ మరింత క్షీణిస్తే ఈ స్థాయికి రావొచ్చు. నిఫ్టికి మద్దతు స్థాయి 17450-17460 ప్రాంతంలో ఉంది.కాబట్టి నిఫ్టికి 17500 ప్రాంతంలో మద్దతు అందుతుందేమో చూడాలి. కాదంటే కొనుగోలు స్థాయికి రావొచ్చు. అంటే నిఫ్టి వంద పాయింట్ల వరకు పడాలి. ఓపెనింగ్ తరవాత నిఫ్టికి మద్దతు లభిస్తే.. క్రితం ముగింపు 17,560 స్థాయిని దాటుతుందేమో చూడండి. ఈ స్థాయిని దాటితే నిఫ్టికి 17640 వరకు పెద్ద అవరోధం లేదు. టెక్నికల్‌గా అన్ని సంకేతాలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. మరి ఈ స్థాయికి నిఫ్టి వస్తుందా అన్నది చూడాలి. వస్తే మాత్రం అమ్మడానికి గోల్డన్ ఛాన్స్‌గా భావించవచ్చు.