For Money

Business News

NIFTY LEVELS : 17100 దాటితే…

నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి లెవల్స్‌ విషయానికొస్తే ఏకంగా 17100ని దాటే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పాక్షిక లాభాలు లేదా పూర్తిగా లాభాలు స్వీకరించడం మంచిది. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కాదు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ కూడా ఇక్కడ లాభాలు స్వీకరించి… కొనుగోలు కోసం వెయిట్ చేయడం మంచిది. మార్కెట్‌ ఇక్కడి నుంచి పడుతుందని ఊహించలేమని.. అయితే ఈ స్థాయిలో కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని అని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డే ట్రేడర్స్‌ అధిక స్థాయిలో లాభాలు స్వీకరించడం మంచిది. నిఫ్టి ఓవర్‌ బాట్‌ పొజిషన్‌లో ఉంది.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17117
రెండో నిరోధం – 17066
తొలి నిరోధం – 17032
నిఫ్టికి కీలకం – 16840
తొలి మద్దతు – 16825
రెండో మద్దతు – 16794
డౌన్‌ బ్రేకౌట్‌ – 16742