ఒక్క పాయింట్ తగ్గినా…
మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 18122. సింగపూర్ నిఫ్టి 77 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి ఇదే స్థాయిలో ప్రారంభమైతే కాస్సేపు వెయిట్ చేయాలని టెక్నికల్ అనలిస్ట్‌లు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే 18000 పుట్ రైటింగ్ అత్యధికంగా ఉంది. ఇక్కడ ఓపెన్ ఇంటరెస్ట్ 1.24 కోట్లు కాగా, 18100 పుట్ కాంట్రాక్ట్ 74 లక్షల ఉంది. సో… నిఫ్టి ఈ మధ్యనే ఉండే అవకాశం ఉందని 18000 దిగువకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువని సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ సింఘాల్ అభిప్రాయ పడుతున్నారు. నిఫ్టి గనుక దిగువ స్థాయి నుంచి కోలుకుంటే రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు నిఫ్టి కొనుగోలు చేయొచ్చని.. అయితే 18068ని స్థాయిని స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌గా ఉంచుకోవచ్చని ఆయన అన్నారు. ఈ స్థాయికి ఒక్క పాయింట్ తగ్గినా… లాంగ్ పొజిషన్ తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఈ స్థాయి దిగువన నిఫ్టిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. కాబట్టి లాంగ్ పొజిషన్ తీసుకునే రిస్కీ ఇన్వెస్టర్లు 18068 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. మరోవైపు బ్యాంక్ నిఫ్టి చాలా బలంగా ఉందని, పడినా… షార్ట్ చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు.