For Money

Business News

స్లీప్‌వెల్‌ చేతికి కర్లాన్‌

స్లీప్‌వేల్‌ బ్రాండ్‌తో పరుపులను విక్రయిస్తున్న షీలా ఫోమ్‌ లిమిటెడ్‌..వ్యాపార విస్తరణలో భాగంగా తన ప్రత్యర్థి అయిన కర్లాన్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఈటీ నౌ ఛానల్‌ పేర్కొంది. మార్కెట్‌ లీడర్‌గా ఎదిగేందుకు షీలా ఫోమ్‌కు ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. ముఖ్యంగా దక్షిణాదితోపాటు ఉత్తర భారతంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ టేకోవర్ షీలా ఫోమ్‌కు ఉపయోపడనుంది. కర్లాన్‌కు దేశ వ్యాప్తంగా 72 బ్రాంచీలు, 10 వేల డీలర్లు ఉన్నారు. అలాగు కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, గుజరాత్‌లలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ టేకోవర్‌ విలువ రూ. 2000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ రంగంలో ఏకైక లిస్టెడ్‌ కంపెనీ షీల్ ఫోమ్స్‌. ఈ కంపెనీ షర్‌ నిన్న 1.58 శాతం లాభంతో రూ. 1295 వద్ద ముగిసింది.