For Money

Business News

హైదరాబాద్‌లో బిగ్‌బాస్కెట్‌ రీటైల్‌ స్టోర్‌

ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువులు డెలివరీ చేసే బిగ్‌బాస్‌ కంపెనీ హైదరాబాద్‌లో షాప్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీని ఇటీవల టాటా గ్రూప్‌ టేకోవర్ చేసిన విషయం తెలసిఇందే. తాజా కూరగాయలు, పళ్లతోపాటు దాదాపు 4,000కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని బిగ్‌బాస్కెట్‌ పేర్కొంది. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మణికొండలో దీనిని ఏర్పాటు చేసింది. తొలుత బెంగళూరులో రీటైల్‌ షాప్‌ ప్రారంభించిన బిగ్‌బాస్కెట్‌ ఇపుడు హైదరాబాద్‌లో ప్రారంభించింది. మార్చి నాటికి మరో మూడు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లో కలిపి మొత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. మొత్తం 400 స్టోర్స్‌ ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.