For Money

Business News

నష్టాల్లో సింగపూర్‌ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు 1.2 శాతంపైగా నష్టంతో క్లోజ్‌ కావడం విశేషం. నాస్‌డాక్‌ 52 వారాల కనిష్ఠ స్థాయికి కేవలం రెండు శాతం దూరంలో ఉంది. ఐటీ, టెక్‌తో పాటు ఎకానమీ షేర్లు కూడా పడటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. మార్కెట్‌ ఇప్పటికే బాటమ్‌కు వచ్చిందని ఎప్పటికపుడు అనుకుంటున్నా… రోజూ పతనం చెప్పడం లేదు. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 104ను దాటింది. క్రూడ్‌, బులియన్‌ స్థిరంగా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా ఒక మోస్తరు నష్టాలతో ఉన్నాయి. మెజారిటీ మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌, తైవాన్‌, జపాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు కూడా అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి ఇపుడు 74 పాయింట్ల నష్టంతో ఉంది.సో.. నిఫ్టి కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. ఇవాళ డిసెంబర్‌ వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌.