LEVELS: పెరిగితే అమ్మండి
నిఫ్టి క్రితం ముగింపు 18,269. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ఉంది. నిజంగానే నిఫ్టి ఈ స్థాయిలో లాభాలతో మొదలైతే.. అక్కడి నుంచి పెరిగితే అమ్మడానికి మంచి ఛాన్స్‌గా భావించాలని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ్టి ట్రేడ్ సెటప్ గురించి ఆలోచించే ప్రపంచ మార్కెట్లను చూస్తే నాస్డాక్ 52 వారాల కనిష్ఠ స్థాయిని బ్రేక్ చేయడానికి సిద్ధమైంది. ప్రపంచ మార్కెట్ల స్థితికి సూచిక నాస్డాక్. ఈ సూచీ బలహీనత ప్రపచం మార్కెట్ల వీక్నెస్ను చూపుతోంది. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే ఇపుడు సెటప్ చూస్తుంటే సెల్ ఆన్ రైజ్‌తో లాభాలు వచ్చే అవకాశముంది. డిసెంబర్ నెలలో ట్రేడింగ్ వ్యాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది. పుట్, కాల్ రేషియా ఇపుడు 0.82 గా ఉందని.. 0.75కు చేరితే నిఫ్టి బైజోన్లోకి వచ్చినట్లు భావించాలని విశ్లేషకులు అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలు చేస్తున్నాయి. నిఫ్టి శుక్రవారం నాటి కనిష్ఠ స్థాయికన్నా దిగువకు వెళ్ళే అవకాశముంది. ఇవాళ కూడా ఓపెనింగ్‌లో ఏదైనా కొనుగోళ్ళు వస్తే…అమ్మకానికి ఇదొక ఛాన్స్‌గా భావింవచ్చు. 18300, 18400 కాల్ రైటింగ్ చాలా జోరుగా సాగుతోంది. కాబట్టి 18300-350 మధ్య నిఫ్టిని అమ్మాలని సీఎన్‌బీసీ యావాజ్ మేనేసింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ సూచిస్తున్నారు. ఈ స్థాయిలో అమ్మేవారు కచ్చితంగా
18,441 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని సూచించారు. నిఫ్టి 18200 స్థాయిలో మద్దతు వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించివచ్చని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే నిఫ్టి 18200 స్థాయిని కోల్పోతే… 20 DMEA అయిన 18080 స్థాయిని తాకే అవకాశాలు ఉన్నాయని అనూజ్ అంచనా వేస్తున్నారు. నిఫ్టి 18000 స్థాయి దిగువకు వెళితే మాత్రం మరింత అమ్మకాల ఒత్తిడి వస్తుందని అన్నారు. అయితే ఇవాళ్టికి 18330 ప్రాంతంలో అమ్మి 18200 ప్రాంతంలో లాభాలు స్వీకరించమని అన్నారు. ఇక నిఫ్టి బ్యాంక్ విషయానికి వస్తే… ప్రస్తుతం ఈ సూచీ నో ట్రేడ్ జోన్లో ఉందని.. ఈ సూచీని పట్టించుకోవద్దని సలహా ఇస్తున్నారు. బ్యాంక్ నిఫ్టి దిగువన
43150 స్థాయిని బ్రేక్ చేయాలి… లేదా పైస్థాయిలో 43,500 దాటితేనే నిఫ్టిలో ట్రేడ్ చేయాలని.. అప్పటి వరకు ఈ సూచీని పట్టించుకోవద్దని సలహా ఇస్తున్నారు.