NIFTY TODAY: 17200 కీలకం
మార్కెట్ కోలుకుంటున్నట్లు అనిపించినా.. అమెరికా మార్కెట్ల షాక్తో మళ్ళీ 17200 ప్రాంతానికి వస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 17392. ఇవాళ నిఫ్టి 200 పాయింట్ల నష్టంతో అంటే 17200 దిగువన ప్రారంభం కానుంది. చాలా మంది అనలిస్టులు బై ఆన్ డిప్స్ను రెకమెండ్ చేస్తున్నారు. వడ్డీ రేట్లను ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసిందని, ముఖ్యంగా మన మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. మరి ఇవాళ విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు కీలకం కానున్నాయి. వెంటనే కాకున్నా.. ప్రథమార్ధంలో మార్కెట్ పతనమయ్యే వరకు ఆగి.. దిగువ స్థాయిలో కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. టెక్నికల్స్ కూడా బై సిగ్నల్ ఇస్తున్నారని సలహా ఇస్తున్నారు. నిఫ్టి17220పైన ఉన్నంత వరకు పరవాలేదు. ఆ స్థాయిని కోల్పోతే 17196, ఆ తరవాత 17168 స్థాయిని తాకే అవకాశముందని అంటున్నారు. నిఫ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17487
రెండో ప్రతిఘటన 17355
తొలి ప్రతిఘటన 17315
నిఫ్టి కీలకం 17268
తొలి మద్దతు 17221
రెండో మద్దతు 17196
డౌన్ బ్రేకౌట్ 17168