For Money

Business News

దుమ్ము రేపిన బుల్స్‌

ఊహించినట్లే నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నిఫ్టి ఆరంభం నుంచి లాభాల్లో దూసుకుపోయింది. దాదాపు ప్రధాన షేర్లన్నీ గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు కొన్ని ఐటీ షేర్లలో కూడా గట్టి మద్దతు లభించింది. ఒకదశలో 17287ను తాకిన నిఫ్టి 17274 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 387 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌ 1276 పాయింట్లు పెరిగింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 3 శాతం పైగా పెరగ్గా, ఇతర ప్రధాన సూచీలు రెండు శాతం నుంచి 2.5 శాతం దాకా పెరిగాయి. నిఫ్టిలో ఏకంగా 48 షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌ గ్రిడ్‌ నామమాత్రపు నష్టాలతో ముగిశాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 8శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 7 శాతం, పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 5 శాతం చొప్పున పెరిగాయి.