MID SESSION: అదే రేంజ్‌లో నిఫ్టి
ఉదయం నుంచి ఆల్గో లెవల్స్‌కు లోబడి నిఫ్టి ట్రేడవుతోంది. తొలి మద్దతు స్థాయి 1740 ప్రాంతంలో కొనుగోళ్ళు వస్తున్నా… 17200 దాటగానే ఒత్తిడి వస్తోంది. దీంతో ఉదయం పలు మార్లు హెచ్చతుగ్గులకు లోనవుతోంది. యూరో మార్కెట్లు గ్రీన్‌లోఉండటంతో నిఫ్టి కూడా నిలకడగా కొనసాగుతోంది. అయితే యూరో స్థాయి లాభాలు మాత్రం లేవు. మరి క్లోజింగ్‌లో రాణిస్తుందా అన్నది చూడాలి. 17300-17400 ప్రాంతంలో కాల్ రైటింగ్ జోరుగా ఉండటం, రేపు డెరివేటరీ ఎక్స్‌పైరీ ఉండటంతో నిఫ్టిలో భారీ లాభాలు కష్టమేనని అనలిస్టులు అంటున్నారు. నిఫికి భిన్నంగా మిడ్ క్యాప్ నిఫ్టి ఒక శాతం దాకా లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి కూడా పరవాలేదు.