17000పైన కొనసాగుతున్న నిఫ్టి
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాల మధ్య మన నిఫ్టి 17000 స్థాయిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉదయం 17114 స్థాయిని తాకిన నిఫ్టి కొన్ని మిషాల్లోనే భారీగా నష్టపోయింది. 16946 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన తరవా కోలుకుని ఇపుడు 17000పైన ట్రేడవుతోంది. నిఫ్టి 71 పాయింట్ల నష్టంతో 17023 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 32 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. గత శుక్రవారం 1.5 శాతం పైగా వాల్‌స్ట్రీట్ నష్టపోగా, ఇపుడు యూరో మార్కెట్లు కూడా అదే స్థాయి నష్టాలతో ట్రేడవుతోంది.. యూరో స్టాక్స్ 50 సూచీ 1.48 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ నాలుగు శాతంపైగా పెరిగి 88.79 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 17000పైన నిలబడుతుందా అన్నది అనుమానాస్పదంగా ఉంది.