నైకా: ఒక షేరుకు అయిదు బోనస్ షేర్లు
ఇవాళ సమావేశమైన ‘నైకా’ మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డు సమావేశం బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకుంది. ఇపుడున్న ఇన్వెస్టర్లకు 5:1 నిష్పత్తి బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న ప్రతి ఒక షేరుకు అయిదు షేర్లను బోనస్‌గా కంపెనీ కేటాయించనుంది. దీనికి రికార్డు తేదీగా నవంబర్ 3ను రికార్డు తేదీగా నిర్ణయించారు. అంటే ఆ తేదీన కంపెనీ రికార్డుల్లో ఉన్న ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు జారీ చేస్తారన్నమాట. బోనస్ షేర్ల జారీ తరవాత కంపెనీ ఈక్విటీ రూ.47.45 కోట్ల నుంచి రూ.284.73 కోట్లకు చేరుతుంది. ఈ కంపెనీ షేర్ ముఖవిలువ రూ.1. బోనస్ షేర్లకు అవసరమైన మొత్తాన్ని కంపెనీ ప్రీమియం అకౌంట్ నుంచి సర్దుబాటు చేస్తారు. ఇవాళ ఎన్ఎస్ఈలో రూ. 1275లకు తాకిన కంపెనీ షేర్ ధర బోనస్ ప్రకటన తరవాత రూ. 1414ని తాకింది. ఇపుడు 7 శాతం లాభంతో రూ. 1356 వద్ద ట్రేడవుతోంది.