స్వల్ప నష్టాలతో నిఫ్టి
ఉదయం ఒకదశలో 17852కు క్షీణించిన నిఫ్టి తరవాత కోలుకుని 17903 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడంతో ఉదయం స్వల్ప ఒత్తిడి వచ్చింది. అయితే దిగువస్థాయిలో మద్దతు అందడంతో పాటు యూరో మార్కెటుల మిశ్రమంగా ఉండటం, అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు స్వల్పంగా ఉండటంతో… నిఫ్టి మళ్ళీ గ్రీన్‌లోకి వస్తుందేమో చూడాలి. విదేశీ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ నికర కొనుగోలుదారులుగా మారడంతో… మార్కెట్ పూర్తిగా డిమాండ్‌ను బట్టి సాగుతోంది. పడిన ప్రతిసారీ పెరుగుతుండటంతో… చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇతర సూచీలు మాత్రం నిలకడగా ఉన్నాయి. వేటిలోనూ పెద్ద నష్టాల్లేవ్. నిఫ్టి నెక్ట్స్ దాదాపు అర శాతం లాభంతో ఉంది. జొమాటో, అదానీ ఎంటర్‌ప్రైజస్, జూబ్లియంట్ ఫుడ్స్, అదానీ గ్రీన్ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టిలో కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్ కాగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్ లూజర్‌గా ఉంది.