దిగువన నిఫ్టికి అందిన మద్దతు
మార్కెట్ ఇవాళ ఉదయం అంచనా వేసిన రెండు స్థాయిలను తాకింది. ఆరంభంలోనే దిగువ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌సెషన్ తరవాత మద్దతు పెరిగింది. ఉదయం 15,768 వద్ద మద్దతు అందడంతో నిఫ్టి నష్టాలను పూడ్చుకున్నా.. మిడ్‌సెషన్ వరకు డీలాగానే ఉంది. ఉదయం అంచనా వేసిన గరిష్ఠ స్థాయిని తాకడానికి మాత్రం యూరో మార్కెట్లు దోహదపడ్డాయనే చెప్పొచ్చు. వరుసగా మూడో రోజు కూడా యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో క్లోజింగ్‌కు ముందు నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 15,899ని తాకినా… 15,856 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 32 పాయింట్లు మాత్రమే పెరిగింది. నిఫ్టి 21 షేర్లు గ్రీన్‌లో ఉన్నా…28 షేర్లు నష్టాల్లో క్లోజ్ కావడం విశేషం. మిడ్ క్యాప్ షేర్ల సూచీ నష్టాల్లో ముగిసింది. చూస్తుంటే ఇవాళ ట్రేడింగ్ కేవలం సూచీ ఆధారిత షేర్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. బ్యాంక్ షేర్ల సూచీ ఒక శాతం పెరగడం విశేషం. పలు రంగాల షేర్లు ఇవాళ నిఫ్టికి మద్దతుగా నిలిచాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఐసీఐసీఐ బ్యాంక్ 676.40 3.12
ఐటీసీ 212.45 2.63
విప్రో 598.00 2.36
ఎస్బీఐ లైఫ్ 1,048.95 2.24
టాటా కన్సూమర్ 776.85 1.66
నిఫ్టి టాప్ లూజర్స్
టాటా మోటార్స్ 295.80 -2.23
గ్రాసిం 1,550.00 -2.03
అదానీ పోర్ట్స్ 678.80 -1.88
ఎల్ అండ్ టీ 1,617.00 -1.53
యూపీఎల్ 819.20 -1.06