నిఫ్టికి అందిన మద్దతు
ఉదయం టెక్నికల్ అనలిస్టులు పేర్కొన్నట్లు గానే నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందింది. ఓపెనింగ్‌లో స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టి తరవాత నష్టాల్లోకి జారుకుంది. 18086 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి కోలుకుని 18199ని తాకింది. ఇపుడు 18,184 వద్ద ట్రేడవుతోంది. ఉదయం నుంచి మెటల్స్ హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడధరలు పెరగడంతో ఓఎన్జీసీ కూడా లాభాల్లో ఉంది. 2022లో ఆటో వాహనాల అమ్మకాలు కూడా కంపెనీల షేర్లపై ప్రభావం చూపుతున్నాయి. బజాజ్ ఆటో ఏకంగా రెండు శాతంపైగా నష్టపోయింది. క్రూడ్ ధరలు పెరగడంతో ఏషియన్ పెయింటర్స్ ఒకటిన్నర శాతం నష్టపోయింది. బజాజ్ ట్విన్స్పై ఒత్తిడి అధకంగా ఉంది. పలు బ్రోకింగ్ సంస్థలు ఈ కంపెనీలను డౌన్‌గ్రేడ్ చేయడం ఒక కారణం.