For Money

Business News

లాభాలతో 2023కి స్వాగతం

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి లాభాలతో ప్రారంభమైంది. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టం చూపగా… ఓపెనింగ్‌లోనే నిఫ్టి దాదాపు 50 పాయింట్ల లాభపడింది. ఓపెనింగ్‌లోనే 18153ని తాకిన తరవాత ఇపుడు 18127 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు ఇతర ప్రధాన సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ అధికంగా 0.26 శాతం లాభంతో ఉంది. నిఫ్టిలో మెటల్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. అలాగే నిన్న వచ్చిన ఆటో డేటాకు మార్కెట్‌ స్పందిస్తోంది. అమ్మకాలు బాగున్న కంపెనీల షేర్లు పెరగ్గా… అమ్మకాలు తగ్గిన కంపెనీల షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అంరత్జాతీయ మార్కెట్‌లో మళ్ళీ క్రూడ్‌ ధరలు బాగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్‌ 86 డాలర్ల ప్రాంతంలో ఉంది. దీంత ఏషియన్‌ పెయింట్స్‌పై ఒత్తిడి పెరిగింది. మిడ్ క్యాప్‌ పీఎస్‌యూ బ్యాంకుల్లో హవా కొనసాగుతోంది.