చివర్లో షార్ట్ కవరింగ్…
మార్కెట్ సరిగ్గా క్లోజింగ్ ముందు స్క్వేర్ ఆఫ్ సమయంలో భారీ షార్ట్ కవరింగ్ వచ్చింది. 17654ను తాకిన నిఫ్టి అర గంటలో 17758 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి 17783ని తాకింది. ఉదయం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత మరింత బలహీనపడింది. యూరో మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ఉండటంతో అనేక షేర్లు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పతనం మెటల్స్‌కు బాగా కలిచి వచ్చింది. ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్స్‌లో మెటల్ షేర్లదే అగ్రస్థానం. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్ దాదాపు ఆరు శాతం పెరిగింది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్ 1.27 శాతం లాభపడింది. మిడ్ క్యాప్‌లో కూడా 0.83 శాతం పెరిగింది. ఇవాళ నిఫ్టి బ్యాంక్ లాభం అర శాతం వరకే పెరిగింది. ఇవాళ బజాజ్ ట్విన్స్ రెండు శాతం దాకా క్షీణించాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా సెయిల్ 4 శాతంపైగా లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్న గ్లాండ్ ఫార్మా ఇవాళ ఏకంగా 15 శాతం క్షీణించడం విశేషం. నైకా కూడా 6 శాతం క్షీణించి రూ.1043ని తాకింది. మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ ఐ షేర్లు మూడు శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్‌లో కూడా ఎంఫసిస్, టీవీఎస్ మోటార్ మూడు శాతం క్షీణించాయి. చెన్నై పెట్రోలియం షేర్ కూడా 12 శాతం నష్టంతో ముగిసింది. మార్కెట్ పైకి గ్రీన్‌లో కన్పిస్తున్నా… ఫలితాలు అంతంత మాత్రమే ఉన్న అనేక షేర్ల ధరలు తగ్గుతున్నాయి.