For Money

Business News

17800 దగ్గరగా నిఫ్టి

మార్కెట్‌ చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది. నిన్నటి సెలవు తరవాత అంతర్జాతీయ మార్కెట్లకు స్పందిస్తూ నిఫ్టి 17783ని తాకింది. ఓపెనింగ్‌లో అరశాతంపైగా సూచీలు పెరిగాయి. నిఫ్టి ప్రస్తుతం 17756 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 100 పాయింట్ల లాభంతో ఉంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ ర్యాలీ కొనసాగుతోంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ పీఎస్‌యూ బ్యాంకులలో లాభాలు కొనసాగుతున్నాయి. నిఫ్టిలో 44 షేర్లు లాభాల్లో ఉన్నాయి. మెటల్స్‌ ఇవాళ నిఫ్టిలో డామినేట్‌ చేస్తున్నాయి. ఇక ఫలితాల విషయానికొస్తే చెన్నై పెట్రో షేర్‌ 15 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఫలితాలు ఓ మోస్తరుగా ఉండటం, బాద్షా టేకోవర్‌తో డాబర్‌ గ్రీన్‌లో ఉంది. ఇక గ్లాండ్‌ ఫార్మా ఆరు శాతం నష్టంతో ఉంది. నైకా ఒక శాతంపైగా నష్టంతో రూ. 1100 వద్ద ట్రేడవుతోంది. ఐపీఓ ధరకన్నా తక్కువకు వచ్చేసింది. యాంకర్‌ ఇన్వెస్టర్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఈ షేర్‌ పూర్తయింది. మరి ఇన్వెస్టర్లు కంపెనీతోనే ఉంటారా? లేదా బయటపడతారా అన్నది చూడాలి. జొమాటొ కూడా ప్రస్తుత స్థాయి నుంచి ముందుకు కదలడానికి ఇబ్బంది పడుతోంది. ఆస్ట్రాల్‌ షేర్‌ రూ.2000 దిగువకు వచ్చేసింది. బ్యాంక్‌ నిఫ్టిలో ప్రైవేట్‌ బ్యాంకులు భారీ లాభాల్లో ఉన్నారు. టెక్నికల్‌ అనలిస్టులు ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఇన్నాళ్ళూ రెకమెండ్‌ చేశారు. కమర్షియల్‌ వెహికల్స్‌ డిమాండ్‌ పెరిగే ఛాన్స్‌ ఉన్నందున ఇపుడు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ను సిఫారసు చేస్తున్నారు. ఇవాళ వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున.. నిఫ్టిలో ఒత్తిడి వస్తుందేమో చూడాలి.