For Money

Business News

రికార్డు లాభాల్లో నిఫ్టి

నిఫ్టి ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. స్వల్ప లాభంతో ప్రారంభమైన నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. ప్రపంచ మార్కెట్లు కూడా చాలా సానుకూలంగా ఉండటంతో నిఫ్టి భారీ లాభాలను ఆర్జించింది. మిడ్‌సెషన్‌లో 16182 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి.. ఇపుడు 16164 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 322 పాయింట్ల లాభంతో ఉంది. హిందాల్కో, టాటా స్టీల్‌ వంటిమెటల్స్‌, కోల్‌ ఇండియా షేర్‌తో పాటు ఓఎన్‌జీసీ నిఫ్టిలో టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక నష్టాల్లో కేవలం మూడు షేర్లు ఉండగా, అవి కూడా నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి. ఇతర అన్ని రంగాల సూచీలు ఒకటిన్నర శాతం లాభంతో ఉన్నాయి. నిఫ్టి ఏకంగా రెండు శాతంపైగా లాభంతో ఉంది. టోకు ధరల సూచీ 17 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరగా, ముడి చమురు ధరలు 115 డాలర్ల వద్ద ఉంటున్నాయి. అయినా మార్కెట్‌లో భారీ ర్యాలీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. యూరో మార్కెట్‌లో కూడా ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక శాతం లాభంతో ఉండటం విశేషం.