For Money

Business News

నిఫ్టి: మరో 200 పాయింట్లు

విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టి షేర్లలో ట్రేడింగ్‌ మొదలు పెట్టేసరికి… ర్యాలీ చాలా జోరుగా ఉంది. ఇవాళ కూడా నిఫ్టి మరో 200 పాయింట్లు పెరిగింది. గత నెల రోజుల నుంచి నికర అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహానికి సాధారణ ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయారు. అసాధారణ పరిస్థితుల్లో మినహా కొత్త సిరీస్‌ ప్రారంభంలో సాధారణంగా ప్రీమియం కరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆప్షన్స్‌ మార్కెట్‌లో ప్రీమియం తగ్గేలా వ్యూహాలు ఉంటాయి. ఒక మోస్తరు ఇన్వెస్టర్లు కూడా కొత్త సిరీస్‌ను ముందే షార్ట్‌ చేస్తారు. వారందరూ ఇపుడు నిట్టనిలువునా మునిగిపోయారు. రెండు రోజుల్లోనే నిఫ్టి అమాంతంగా పెరగడంతో ఆప్షన్స్‌ ప్రీమియాలు బాగా పెరిగాయి. ఉదయం ఆరంభంలో కొద్దిసేపు నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి తరవాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌లో ఒకసారి చిన్న ఝలక్‌ వచ్చినా… షార్ట్‌ కవరింగ్‌ నిఫ్టి దూసుకుపోయింది.చివరి అర గంటలో నిఫ్టికి కరెక్షన్‌ వస్తుందని ఆశించినవారికి గట్టి దెబ్బ పడింది. వెరశి క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 201 పాయింట్ల లాభంతో 17,132 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.3 శాతం లాభపడింది. అంటే టాప్‌ 100 షేర్లలోనే ట్రేడింగ్‌ పరిమితమైంది. బ్యాంక్‌ నిఫ్టి నామ మాత్రపు లాభాలకే పరిమితం కాగా, ఫైనాన్షియల్‌ ఒక శాతంపైగా పెరిగాయి. మిడ్‌ క్యాప్‌ సూచీలో వృద్ధి జీరో. దీన్ని బట్టి చూస్తే… ఇవాళ్టి ట్రేడింగ్‌ మొత్తం నిఫ్టిని పెంచడానికి జరిగిందన్నమాట.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
భారతీ ఎయిర్‌టెల్‌ 662.00 6.70
బజాజ్‌ ఫైనాన్స్‌ 7,529.00 5.07
హిందాల్కో 470.00 4.90
ఐషర్‌ మోటార్స్‌ 2,674.00 4.70
శ్రీసిమెంట్‌ 28,250.00 4.02

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 287.60 -1.49
నెస్లే ఇండియా 19,500.00 -1.23
ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌ 992.95 -1.21
రిలయన్స్‌ 2,257.00 -0.58
బీపీసీఎల్‌ 471.50 -0.22