For Money

Business News

MID SESSION: ఈ పతనాన్ని ఆపతరమా?

మార్కెట్‌ ప్రధాన మద్దతు స్థాయిని పరీక్షిస్తోంది. 15835 స్థాయి మార్కెట్‌కు అత్యంత కీలకమని భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే ఒంటి గంటకు నిఫ్టి 15832ను తాకింది. నిఫ్టి 405 పాయింట్ల నష్టంతో ఉంటే, సెన్సెక్స్ 1335 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు రెండు శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రధాన మార్కెట్లు 1.5 శాతం నష్టంతో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 2.02 శాతం నష్టంతో ఉంది. అంతకు మించి 2.5 శాతం మేర భారత మార్కెట్లు నష్టపోవడానికి కారణం.. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడం. అలాగే రాత్రి భారీ నష్టాల తరవాత కూడా అమెరికా ఫ్యూచర్స్‌ మళ్ళీ ఒక శాతం దాకా నష్టంతో ట్రేడవుతోంది. దీంతో దిగువ స్థాయిలో కూడా నిఫ్టిని కొనేందుకు ఇన్వెస్టర్ల జంకుతున్నారు. పరవాలేదు.. ఇలాంటి స్థాయిలో కొనమని పలువురు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు… దిగువ స్థాయిలో మద్దతు రావడం లేదు. క్లోజింగ్‌లో ఏమైనా షార్ట్‌ కవరింగ్‌ వస్తుందేమో చూడాలి. ముఖ్యంగా నిన్నటి ర్యాలీని నమ్మిన ఇన్వెస్టర్లు ఇవాళ భారీగా నష్టపోయారు. వీరు బయటపడే ఛాన్స్‌ను మార్కెట్‌ ఉదయం నుంచి ఇవ్వలేదు.