స్థిరంగా ముగిసిన నిఫ్టి
తీవ్ర ఆటుపోట్ల మధ్య నిఫ్టి స్థిరంగా ముగిసింది. సెషన్ క్లోజింగ్ ముందు 15,858 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి .. తరవాత కోలుకుని 15938 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 28 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించింది. ఇవాళ అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టి బ్యాంక్ అరశాతంపైగా నష్టపోయింది. ఏయూ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు రెండున్నర శాతంపైగా నష్టంతో ముగిశాయి. నిఫ్టిలో సన్ ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 1.6 శాతం నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ ట్రాన్స్మిషన్ టాప్ గెయినర్ కాగా, జొమాటొ దాదాపు అయిదు శాతం నష్టంతో రూ. 55.60 వద్ద ముగిసింది. నిన్న ఫలితాలు ప్రకటించిన మైండ్ ట్రీ నాలుగు శాతం తగ్గింది.