15700 కోల్పోయిన నిఫ్టి
మార్కెట్ నష్టాల్లో ముగిసింది. మిడ్ సెషన్లో వచ్చిన లాభాలు క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. 2 గంటల తరవాత నిష్టి నష్టాల్లోకి జారుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్ల నష్టంతో 15,692 వద్ద నిఫ్టి ముగిసింది. యూరప్ మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నా… మన మార్కెట్లు నష్టాల్లో ముగియడం విశేషం. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా ఒక మోస్తరు లాభాల్లో ఉన్నాయి. అయితే అధిక స్థాయి నుంచి యూరో పడుతూ వచ్చింది. ఒకటిన్నర శాతం నుంచి ఒక శాతానికి సూచీలు పడ్డాయి. ఒక మన మార్కెట్లో ఇటీవల బాగా పడిన అనేక షేర్లు ముఖ్యంగా బజాజ్ ట్విన్ కోలుకున్నాయి. ప్రభుత్వ రంగ షేర్లు ఇవాళ సూచీని పడేశాయి. నిఫ్టి నష్టాల్లో ముగిసినా మిగిలిన అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి ఫైనాన్షియల్స్ 0.7 శాతంపైన లాభంతో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టిలో ఏమాత్రం చలనం లేదు. ఒక షేర్ల విషయానికొస్తే బజా్ ట్విన్స్ టాప్ గెయినర్స్ కాగా, టాటా మోటార్స్ తరవాతి స్థానంలో ఉంది. చిత్రంగా చాలా మంది అనలిస్టులు ఇవాళ టాటా మోటార్స్‌లో సెల్ కాల్ ఇచ్చారు. రిలయన్స్ రూ.2600 దిగువన క్లోజైంది.