For Money

Business News

భారీ లాభాలతో ముగిసేనా?

ఉదయం నుంచి నిఫ్టి స్థిరంగా ఉంది. స్వల్ప లాభాల నష్టాలు ఉన్నా 15700పైనే ఉంటూ వచ్చింది. ఆరంభంలో నష్టాలు ఉన్నా… వెంటనే కోలుకుంది. ఇపుడు 35 పాయింట్ల లాభంతో 15766 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 30కి పైగా షేర్లు లాభాల్లో ఉన్నా… లాభాలు అంతంత మాత్రమే ఉన్నాయి. అయితే యూరో మార్కెట్లు చాలా పటిష్ఠంగా ప్రారంభమయ్యాయి. యూరో సూచీలన్నీ ఒకటిన్నర శాతం లాభంతో ఉన్నాయి. జర్మనీ డాక్స్‌, యూరో స్టాక్స్‌ 50లు కూడా 1.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. మరి మన నిఫ్టి 15,800ని దాటుతుందేమో చూడాలి. నిఫ్టి పెరిగినపుడల్లా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అయితే చాలా మంది విశ్లేషకులు లాంగ్‌ పొజిషన్స్‌ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. కొందరు 15600 పుట్‌, ,15800 కాల్‌ కాంట్రాక్ట్‌లతో స్ట్రాడల్‌ ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.