స్టాక్ మార్కెట్‌లో రక్తపాతమే
ఉదయం భారీ నష్టాల నుంచి కోలుకున్నట్లే కన్పించిన భారత మార్కెట్‌లకు యూరో మార్కెట్లు చావు దెబ్బతీశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు రెండు శాతం వరకు నష్టాలతో క్లోజ్ కావడంతో నిఫ్టి కూడా దాదాపు అదే స్థాయి నష్టాలతో ప్రారంభమైనా.. యూరోపై ఆశలతో కోలుకున్నాయి. మిడ్ సెషన్ 16650 స్థాయిని చేరుకున్నాయ. అయితే యూరో మార్కెట్లు ఏకంగా నాలుగు శాతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో నిఫ్టి మరోసారి కుప్పకూలింది. నిఫ్టి 16,423 కనిష్ఠ స్థాయిని తాకింది. ఇవాళ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున నిఫ్టి కోలుకుంటుందా లేదా ఇంకా పడుతుందా అన్నది చూడాలి.