For Money

Business News

102 డాలర్లు దాటిన క్రూడ్‌

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పెంచడంతో క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్‌లో ధరలు దూసుకు పోతున్నాయి. రష్యాకు చెందిన ముడిచమురు కంపెనీల పైప్‌లైన్లు ఉక్రెయిన్‌ వేల కిలోమీటర్ల మేర ఉన్నాయి. యుద్ధం ఉధృతమైతే ఈ పైప్‌లైన్ల ద్వారా క్రూడ్‌ సరఫరా కష్టం కావొచ్చు. దీంతో క్రూడ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఇవాళ కీలక స్థాయిని దాటింది. మార్చి నెల కాంట్రాక్ట్‌ బ్రెంట్ క్రూడ్ ధర 102 డాలర్లకు చేరింది. 2014 తరవాత క్రూడ్‌ ధరలు ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి. ఆసియా దేశాలు బ్రెంట్‌ క్రూడ్‌ను కొంటాయి. యుద్ధవాతావరణం చల్లబడే వరకు క్రూడ్ మార్కెట్‌లో ధరలు తగ్గే అవకాశం కన్పించడం లేదు.