For Money

Business News

17,500పైన ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. 17,536 స్థాయిని నిఫ్టి ఇపుడు 17,507 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 110 పాయింట్ల నష్టంతో ఉంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి అత్యధికంగా ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టికి 17,540-17,575 మధ్య గట్టి అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా అరశాతం నష్టంతో ఉన్నందున ట్రేడింగ్‌ పెరిగే కొద్దీ నిఫ్టిపై ఒత్తిడి పెరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. లాంగ్ పొజిషన్స్‌లో ఉన్నవారు తమ పొజిషన్స్‌ తగ్గించుకోవడానికి ఇది గోల్డన్‌ ఛాన్స్‌అని అనలిస్టులు సూచిస్తున్నారు. నిఫ్టిపై ఇక్కడి నుంచి ఒత్తిడి పెరిగే అవకాశముంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 17540 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మడమే బెటర్‌ అని సలహా ఇస్తున్నారు. మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైతే నిఫ్టిలో అమ్మకాలు పెరిగే అవకాశముంది. ఏ ఒక్క రంగం నుంచీ మద్దతు అందండం లేదు. మార్కెట్‌కు లీడర్‌గా ఉన్న ఐటీ రంగం పతనంవైపు పయనిస్తోంది. ఇతర రంగాలు కూడా ఫాలో అయ్యే అవకాశముంది.