భారీ నష్టాలతో ముగిసింది
అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి, దేశీయంగా పాజిటివ్ అంశాలు లేకపోవడంతో నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. నిఫ్టి గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా లాభాల స్వీకరణకు ఆసక్తి చూపారు. ఉదయం ఆరంభంలో 17901 పాయింట్లను తాకిన నిఫ్టి 17,779 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. దిగువ స్థాయి నుంచి నిఫ్టి మిడ్ సెషన్లో కోలుకున్నా… ఆ తరవాత క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. రెండు సార్లు కోలుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 150 పాయింట్లు క్షీణించింది. నిఫ్టిని మొన్న ఏ షేర్లయితే భారీగా పెంచాయో… అవే షేర్లు ఇపుడు నిఫ్టిని కిందికి దించాయి. నిన్న మాదిరిగానే, ఇవాళ కూడా హెచ్డీఎఫ్సీ ట్విన్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ రెండు షేర్లకు తోడు హెచ్డీఎఫ్సీ లైఫ్ కూడా తగ్గంది. డాలర్ భారీగా బలపడుతున్నా… ఐటీ, ఫార్మా కౌంటర్లు భారీ నష్టాలతో క్లోజ్ అవుతున్నాయి. నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు గ్రీన్లో ముగిశాయి.