For Money

Business News

భారీ అమ్మకాల ఒత్తిడిలో నిఫ్టి

బ్యాంకు షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడితో నిఫ్టి భారీగా నష్టపోయింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ గ్రీన్‌లో ఉన్నా నిఫ్టి 0.77 శాతం నష్టపోయింది. మిడ్‌ సెషన్‌కు ముందు17,779ని తాకిన నిఫ్టి ఇపుడు కోలుకుని దాదాపు ఉదయం స్థాయికి వచ్చింది. కాని వెంటనే వంద పాయిట్లు నష్టపోయి 17818 వద్ద ట్రేడవుతోంది. ఒంటి గంటల తరవాత నిఫ్టిలో గట్టి ఒత్తిడి వచ్చింది. అయితే ఇదే సమయంలో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనా… నష్టాలు అర శాతం లోపే ఉన్నాయి. ఇతర సూచీల్లో పెద్ద నష్టాలు లేకపోవడంతో నిఫ్టి క్లోజింగ్‌ ముందు కోలుకుంటుందా అనేది చూడాలి. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన మూడు కంపెనీల్లోనూ భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అత్యధికంగా బ్యాంక్ 3 శాతం దాకా నష్టపోయింది. మొన్న 1750దాకా వెళ్ళిన షేర్‌ ఇవాళ రూ. 1563కి పడిపోయింది. ఉదయం నుంచి కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి.