18050 దిగువన నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18040 పాయింట్లను తాకింది. ఇపుడు 18072 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 85 పాయింట్ల నష్టంతో ఉంది. సూచీలు కాస్త స్థిరంగా ఉన్నట్లు కన్పించినా… ఫలితాలు సరిగా లేని అనేక కంపెనీల్లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇవాళ యాక్సిస్ బ్యాంక్‌లో బ్లాక్ డీల్ సాగుతోంది. ఈ షేర్ రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 34 షేర్లు నష్టాలతో ఉన్నాయి. లాభాలు ఉన్నా చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఫలితాల విషయానికొస్తే రామ్‌కో సిమెంట్ దాదాపు పది శాతం నష్టపోయింది. టాటా మోటార్స్ కూడా 4 శాతంపైగా నష్టపోయింది. ఇక ఫార్మా రంగంలో అనేక షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. లుపిన్ 7 శాతంపైగా లాభంతో ఉంది. దీపక్ నైట్రేట్, పరిమల్ ఎంటర్‌ప్రైజస్ షేర్లు ఏడు శాతం నష్టంతో ఉన్నాయి. నైకా షేర్లు ఇవాళ ఎక్స్ బోనస్‌లో ట్రేడవుతోంది. నాలుగు శాతం లాభం నుంచి నష్టాల్లోకి వచ్చేసింది. లాకిన్ పీరియడ్ అయిపోవడంతో ఈ కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున …నిఫ్టిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు.