For Money

Business News

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి దాదాపు వంద పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 92 పాయింట్ల నష్టంతో 16569 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన ఐటీ షేర్లలో ఒత్తిడి కనిపిస్తోంది. సూచీలు నష్టాల్లో ఉన్నా చాలా వరకు షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని సూచీలు రెడ్‌లో ఉన్నాయి. అయితే నిఫ్టి మిడ్ క్యాప్‌ మాత్రం దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దేఉంది. క్రూడ్‌ భారీగా పెరిగినందున ఓఎన్‌జీసీ షేర్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆటో షేర్లలో ఇవాళ కూడా మద్దతు కొనసాగుతోంది. పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో సన్‌ ఫార్మా 3 శాతం నస్టంతో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. చాలా వరకు అదానీ షేర్లలో కూడా కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. ఎల్‌ఐసీ షేర్‌లో తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ షేర్‌ ఓపెనింగ్‌లోనే రూ. 18 నష్టపోయింది.