For Money

Business News

రూ.810కి పడిన ఎల్‌ఐసీ

ఎల్‌ఐసీ ఫలితాల పట్ల మార్కెట్‌ తీవ్ర నిరాశతో ఉంది. ఆరంభంలోనే నాలుగు శాతం దాకా పడిన షేర్‌ రూ. 810కి చేరింది. మే 26న ఈ షేర్‌ రూ. 801కి పడిపోయింది. ఇదే ఇప్పటి వరకు ఈ షేర్‌ కనిష్ఠ స్థాయి. అంటే మరో రూ.9 దూరంలో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి ఉందన్నమాట. ఎల్‌ఐసీ ఫలితాల తరవాత కనీసం బ్రోకరేజి సంస్థలు కూడా స్పందించడం లేదు. సాధారణంగా పెద్ద కంపెనీల ఫలితాల తరవాత బ్రోకేజీ సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తాయి. దీంతో ఎల్‌ఐసీ షేర్‌ ధరపై డైరెక్షన్‌ లేకపోయింది. దీంతో దీర్ఘకాలానికి షేర్లు కొనాలనుకున్నవారు కూడా సందిగ్ధంలో పడ్డారు. షేర్ల డెలివరీ శాతం కూడా 35 శాతం దాటడం లేదు.కంపెనీ ఫలితాలను పరిశీలించిన తరవాత కొన్ని బ్రేకరేజీ సంస్థలైనా తమ సలహా ప్రచురిస్తాయేమో చూడాలి.