17200 దిగువన నిఫ్టి
ఓపెనింగ్‌లోనే నిఫ్టి 370 పాయింట్లు క్షీణించింది. 17182ను తాకిన నిఫ్టి ఇపుడు 17194 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 1243 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లకు మన మార్కెట్ స్పందిస్తోంది. అమెరికా ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు… క్రూడ్ ఆయిల్ 102 డాలర్లకు చేరడంతో… మార్కెట్ ప్రతికూలంగా స్పందిస్తోంది. నిఫ్టిలో మొత్తం 50 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నో గెయినర్స్. అన్ని సూచీలు 2 శాతంపైగా నష్టపోయాయి. అత్యధికంగా నిఫ్టి బ్యాంక్ 2.63 శాతం క్షీణించింది. నిఫ్టి ఐటీ సూచీ 4.55 శాతం క్షీణించింది. దీన్ని బట్టి ఐటీ షేర్లలో వచ్చిన ఒత్తిడిని అంచనా వేయొచ్చు. నిఫ్టి లూజర్స్‌లో టాప్ 5లో నాలుగు షేర్లు ఐటీ షేర్లు ఉండటం విశేషం. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నాలుగు శాతంపైగా నష్టపోయాయి. టీసీఎస్ 3.35 శాతం నష్టంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌లోనూ ఇదే పరిస్థితి. నౌకరీ డాట్ కామ్ 5 శాతంపైగా నష్టపోయింది. మైండ్ ట్రీ, జొమాటొ కూడా నాలుగు శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి మిడ్ క్యాప్‌లో ఐఆర్సీటీసీ 5శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి బ్యాంక్ షేర్లలో బ్యాంక్ ఆఫ్ బరోడా 4.44 శాతం నష్టపోయింది. దాదాపు అన్ని సూచీల్లో ఒక్క షేర్ కూడా గ్రీన్‌లో లేదు. అన్నీ నష్టాల్లోనే. అయితే ఎన్డీటీవీ షేర్లో మాత్రం కొనుగోళ్ళ మద్దతు కొనసాగుతోంది. ఈ షేర్ ఇవాళ కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఇవాళ 5 శాతం పెరిగి రూ. 449 వద్ద ఉంది. నో సెల్లర్స్..