17000 దిగువకు నిఫ్టి
మెటల్, పవర్, ఫార్మా రంగాల్లో వచ్చిన భారీ అమ్మకాల ఒత్తిడి కారనంగా నిఫ్టి 17000 దిగువకు చేరింది. ఉదయం 16920ని తాకిన నిఫ్టి ఇపుడు 16937 వద్ద ట్రేడవుతోంది. ఓఎన్జీసీ భారీగా లబ్ది పొందగా, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టి పీఎస్‌యూ బ్యాంకులు బాగా రాణిస్తున్నాయి. ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల్లో ఒత్తిడి కనిపిస్తున్నా… మరీ ఆందోళనకరంగా లేదు. ఫార్మా రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్, సిప్లా, రెండు శాతంపైగా నష్టపోయాయి. దివీస్‌ల్యాబ్ రూ.4400 దిగువకు రావడం విశేషం. నిఫ్టిలో ఇన్ఫోసిస్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా నిలిచాయి. ఇక నష్టాల్లో టైటాన్ అగ్రస్థానంలో ఉంది. ఫలితాలు బాగా లేకపోవడంతో టైటాన్ దాదాపు మూడు శాతం నష్టపోయింది. రిలయన్స్, బజాజ్ ట్విన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.