For Money

Business News

మరింతగా క్షీణించిన మార్కెట్లు

ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ నష్టాలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచి మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. దాదాపు అన్ని సూచీలు రెడ్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్‌ షేర్లు మాత్రమే తక్కువ నష్టాలతో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతం నష్టంతో ట్రేడవుతుండగా… నిఫ్టితో సహా మిగిలిన అన్ని సూచీలు రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టి 2.02 శాతం నష్టపోగా, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 2.18 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్‌ సెషన్‌లో 16,866 పాయింట్లకు పడిపోయింది. యూరో ఫ్యూచర్స్‌తో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. యూరో మార్కెట్ల ప్రారంభం తరవాత నష్టాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.అలాగే ఇవాళ డెరివేటివ్స్‌ ముగింపు ఉన్నందున… నిఫ్టి ఎలా ముగుస్తుందో చూడాలి.