మద్దతు స్థాయి వద్ద నిఫ్టి
మార్కెట్ ఇవాళ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడవుతోంది. 16636 వద్ద ప్రారంభమైన నిఫ్టి 16560ని తాకిన తరవాత 16567 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 64 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలన్నీ ఇదే స్థాయిలో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్ కూడా 0.37 శాతం నష్టంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్ 0.44 శాతం నష్టపోయింది. అయితే మార్కెట్ ఇపుడు ఐటీ కౌంటర్ల స్థాయిలో బ్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజూ నిఫ్టి బ్యాంక్ క్షీణించినా… వెంటనే కోలుకుంటోంది. మరి ఇవాళ బ్యాంక్ షేర్లు నిఫ్టిని నిర్ణయించనున్నాయి. బజాజ్ ట్వీన్స్ ఇవాళ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఫలితాలకు స్పందిస్తూ టాటా స్టీల్ గ్రీన్‌లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 2 శాతంపైగా నష్టంతో లూజర్స్‌లో టాప్‌లో ఉంది. జొమాటో షేర్ ఇవాళ మరో అయిదు శాతంపైగా క్షీణించింది. ఇపుడు రూ. 45 వద్ద ట్రేడవుతోంది.