స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

మెటల్స్ అండ కారణంగా నిఫ్టి స్వల్ప నష్టాలకు పరిమితమైంది. నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో 17245 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 304 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద ముగిసింది. ఇవాళ ఓపెనింగ్‌లో నిఫ్టికి ఉదయం అనలిస్టులు హెచ్చరించినట్లే 17400పైన 17442 పాయింట్ల వద్ద ఒత్తిడి ఎదురైంది. అక్కడి నుంచి ఏకంగా 240 పాయింట్ల వరకు క్షీణించి 17199 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నిఫ్టి తాకింది. కాని చివర్లో స్వల్పంగా కోలుకుంది. నిఫ్టి బ్యాంక్ ఇవాళ అరశాతంపైగా నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు మాత్రం స్వల్ప లాభాలతోనే ముగిశాయి. నిఫ్టిలో దివీస్ ల్యాబ్ టాప్ గెయినర్‌గా నిలిచింది. హిందాల్కో, టాటా స్టీల్ కూడా నిఫ్టికి అండగా నిలిచింది. ఇక నిఫ్టి టాప్ లూజర్‌గా కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచింది. పెరిగినపుడల్లా ఈ షేర్‌పై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. తరవాతి స్థానంలో హెచ్డీఎఫ్సీ ఉండటం విశేషం.