For Money

Business News

తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపు

తెలంగాణలో విద్యుత్‌ చార్జీలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (TSERC) అనుమతి ఇచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లో విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఛైర్మన్‌ రంగారావు మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ డిస్కమ్‌లు చార్జీలు 18 శాతం పెంచేందుకు అనుమతి కోరాయని,అయితే సగటున విద్యుత్ చార్జీలను 14 శాతం పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గృహ అవసరాలకు వాడే విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచనున్నారు. ఇతర కేటగిరీలకు మాత్రం యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున పెరుగుతంది. 2022-23 ఏడాదికి రూ. 16000 రెవెన్యూ గ్యాప్‌ డిస్కమ్‌లు ప్రతిపాదించగా, తాము రూ. 14,230 కోట్లకు ఆమోదించినట్లు శ్రీరంగారావు అన్నారు. ఎల్‌ టీ వినియోగదారులకు ఫిక్సెడ్‌ చార్జీలను రూ.10గా నిర్ణయించింది. ఈఆర్‌సీ అనుమతి ఇచ్చినందున విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది.