For Money

Business News

MID SESSION: వంద పాయింట్లు డౌన్‌

నిఫ్టి సరిగ్గా ఆల్గో లెవల్స్‌ ప్రకారం ట్రేడవుతోంది. ఉదయం స్వల్పంగా తగ్గి.. ఆ తరవాత 16,590 పాయింట్లు దాటగానే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. పడినపుడల్లా మద్దతు లభిస్తున్నా.. మిడ్‌ సెషన్‌లో భారీగా క్షీణించింది. 16,495 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అంటే వంద పాయింట్ల పతనం. సరిగ్గా ఆల్గో తొలి సపోర్ట్‌ లెవల్‌ 16500 నుంచి కోలుకుని ఇపుడు 16,537 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 31 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌ టాప్‌ లూజర్‌ కాగా, టెక్‌ మహీంద్రా టాప్ గెయినర్‌గా నిలిచింది. బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతం, మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ 0.85 శాతం, ఫైనాన్షియల్స్‌ సూచీ 0.8 శాతం చొప్పున నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈలోగా ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.35 శాతం నష్టంతో ట్రేడవుతోంది.